పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా సబ్ స్టేషన్ వద్ద ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడిపి నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆదేశాల వరకు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర సోమవారం నాడు టిడిపి మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీలను ఏడుసార్లు పెంచి దాదాపుగా 57 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై భారం వేశారని టిడిపి మండల కో కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రజలు నెత్తిన భారం మోపడం వైసిపి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు వైసిపి అరాచక ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి తెలిపారు . ప్రపంచ బ్యాంకుకు అమ్ముడుపోయి రైతుల పోలాలకు మీటర్లు బిగించడం ఎంతవరకు సమంజసం అని వెంటనే ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చిందుకూర్ సర్పంచ్ అనసూయమ్మ. పంట రాంచంద్రారెడ్డి.. ఎస్ఏ ఫరూక్.. దుర్వేసి కృష్ణ యాదవ్. సుదర్శన్ రెడ్డి. టిడిపి సోషల్ మీడియా స్టేట్ మెంబర్ బత్తుల సుభద్రమ్మ. ఒడ్డు లక్ష్మీదేవి. ఐ టి డి పి కన్వీనర్ బివిఎన్ రాజు. హర్షవర్ధన్. నారాయణరెడ్డి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.