ఉరుకుంద ఈరన్న స్వామి రాజ గోపురానికి విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో శ్రీ నరసింహ వెలిసిననటు ఈరన్న స్వామి, దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు కంబలపాడు ( క్రిష్ణగిరి మండలం) వాస్తవ్యులు సద్దాల లక్షయ్య & సన్స్ వారు Rs.1,00,011/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, నాగరాజ్ స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.