ఓల్డ్ గైనిక్ బ్లాక్ ట్రై ఏజ్ విభాగంలో కోవిడ్ మాక్ డ్రిల్
1 min read– ఇంచార్జ్ సూపరింటెండెంట్ డా.ప్రభాకర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కోవిడ్ సన్నద్ధ భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ పలు విభాగాలైన ట్రై ఏజ్ ఏరియా, జగనన్న ప్రాణ వాయువు, ఆక్సిజన్ ప్లాంట్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, సర్జికల్ స్టోర్ లలో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని కోవిడ్ కేసులు ఏవైనా ఎమర్జెన్సీగా వచ్చిన, వాటిపై సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు దీనిలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్న కరోనా మాక్ డ్రిల్ లో వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అందరూ పాల్గొన్నట్లు తెలిపారు.ఓల్డ్ గైనిక్ బ్లాక్ (ట్రై ఏజ్ ఏరియా) కోవిడ్ పేషెంట్లకు కొరకు 40 బెడ్స్ వెంటిలేటర్స్ మరియు 40 ఆక్సిజన్ ఫోర్స్ రెడీ చేసాము.వారికి కావాల్సిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు పెరిగున ఎడల మరిన్ని బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. జగనన్న ప్రాణ వాయువు ఆక్సిజన్ ప్లాంట్ మరియు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, ఆక్సిజన్ నిలువలు మరియు ఆక్సిజన్ యొక్క సామర్ధ్యాన్ని పరిశీలించి వాటి గురించి ఆరా తీశారు.సర్జికల్ స్టోర్ ను పరిశీలించి అనంతరం పిపి కీట్స్, మాస్కులు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ , గ్లౌజెస్, పల్స్ ఆక్స్ మీటర్స్, సిద్ధంగా అందుబాటులో ఉండాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమానలిని, వైద్య అధ్యాపకులు డా.రామ్ శివ నాయక్, అడ్మిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఇంచార్జ్ సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, గారు తెలిపారు.