చలివేంద్రం ఏర్పాటు చేసిన 16వ వార్డు కౌన్సిలర్ విజయ్ చౌదరి
1 min read– ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆసియా మారుఫ్..
– తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సాయం చేయాలనే గుణంతో
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేసిన ఆత్మకూరు పట్టణ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ విజయ్ చౌదరి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ మరుఫ్ ఆసియా చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అదే విధంగా పనిపై గ్రామానికి వచ్చిన ప్రయాణికులు సైతం చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని వారి సేవల పట్ల కొనియాడుతూ ధన్యవాదములు తెలిపారు… ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు, ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, ప్రయాణికులు పాల్గొన్నారు.