తుమ్మలపల్లి కళాక్షేత్రంవద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
1 min read– కులమతని బంధనలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన నాయకుడు జ్యోతిరావు పూలే. జమీల్ అహ్మద్ బేగ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంవద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ జ్యోతిరావు ‘జ్యోతిబా’ గోవిందరావు ఫూలే పందొమ్మిదవ శతాబ్దపు భారతదేశానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, ఆలోచనాపరుడు. భారతదేశంలో ఉన్న కుల నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు మరియు రైతులు, ఇతర తక్కువ కులాల ప్రజల హక్కుల కోసం పోరాడాడు. మహాత్మా జ్యోతిబా ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు, తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించిన మొదటి హిందువుగా ఆయన విశ్వసిస్తారు. జ్యోతిబా ఫూలే తన జీవితమంతా బ్రాహ్మణుల దోపిడీ నుండి అంటరానివారి విముక్తి కోసం అంకితం చేశారని జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. కార్యక్రమానికి పూలే అభిమానులు ,తదితరులు, పాల్గొన్నారు.