ఎన్‌సిపికి జాతీయ హోదా రద్దు చేయడం విచారకరం
1 min read– జమీల్ అహ్మద్ బేగ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదాను రద్దు చేసిన విషయంపై . నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ స్పందిస్తూ .. ఈసీ ఎన్‌సిపికి జాతీయ హోదా రద్దు నిర్ణయం తీసుకోవడం విచారకరమని, ప్రకటనలో తెలిపారు. ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ ఎంతో అనుభవంగల సీనియర్ నాయకులు అని, ఆయన సారథ్యంలో మరింత ఉత్సాహంతో తిరిగి పార్టీని పునరుజ్జీవింపజేసి రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని సమస్యలపై పోరాడుతామని,భవిష్యత్ ప్రణాళికను వేసుకొని, కార్యాచరణ చేపడతామని, జమీల్ అహ్మద్ బేగ్ ఓ ప్రకటనలో తెలిపారు .