ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే 197 జయంతి వేడుకలు
1 min read– నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే,కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్, డిప్యూటీ మేయర్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన కొనియాడారు.మంగళవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని బిర్లా గేట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక,బిసి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పూలమాలవేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అంతకుముందు శరీన్ నగర్ లో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ శ్రీ జ్యోతిబా పూలే జయంతి మహోత్సవం పురస్కరించుకొని మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, నగర డిప్యూటీ కమిషనర్ రమాదేవి,బీసీ వెల్ఫేర్ ఈడి ఏ నాగేశ్వరరావు, వార్డు కార్పొరేటర్, ఆర్డిఓ హరిప్రసాద్, బీసీ ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయం అని, ప్రభుత్వ ఆధ్వర్యంలో మహానుభావులు జ్యోతిబాపూలేను స్మరించుకుంటూన్నామన్నారు. బడుగు బలహీన వర్గాల వారు ఎలా నడుచుకోవాలని దిశ నిర్దేశం చేసిన మహానుభావులు పూలే అన్నారు. సమాజంలో కుల, మత విభేదాలు లేకుండా లింగ విభేదాలు లేకుండా మనిషిని మనిషి ఏ విధంగా గౌరవించాలి అనేది విద్యతోనే సాధ్యమవుతుందని అనే సమాచారాన్ని మనకు అందించారన్నారు. అందుకొరకే అలాంటి మహానుభావులు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నామన్నారు. ఆనాడు వారు విద్యకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఈరోజు మన ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యతను ఇస్తుంది అని అన్నారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించుచున్నది అన్నారు. సమాజంలో బాల్య వివాహాలకు స్వస్తి చెప్పాలని బాల్య వివాహల వల్ల కలిగే నష్టాలను సమాజానికి తెలియజేయలన్నారు.ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిబా పూలే అహర్నిశలు కృషి చేశారన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్య మిస్తూ వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అంటరానితనం, కుల వివక్ష విభేదించి తన జీవితాన్ని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితం చేశారన్నారు. ఆయన చూపిన బాటలో అందరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మత, వర్గ, వర్ణంతో సంబంధం లేకుండా అందరూ సమానమేనని చాటిచెప్పారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్ లు వచ్చాయన్నారు. బీసీల అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బహుత్తమ క్లాస్ గా చేయాలని పార్లమెంటులో వివిధ వ్యక్తిగత బిల్లులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. మహాత్మా జ్యోతిభాపులే విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామని, అదే విధంగా బిసి భవన్ నిర్మాణానికి ఎంపి ల్యాండ్స్ ద్వారా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అయితే అది ప్రభుత్వ స్థలంలో ఉన్నందున దానికి నిధులు మంజూరు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి నిధులు మంజూరుకు కృషి చేస్తానని బిసి సంఘ నాయకులు వివరించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శప్రాయుడు అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. సమాన హక్కుల కొరకు, అట్టడుగు జాతుల విద్యాభివృద్ధి కోసం సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చారన్నారు. ఆడపిల్లలకు చదువు అవసరం అని ఆనాడే పాఠశాలలను నెలకొల్పిన మహనీయులు జ్యోతిబాపూలే అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు రాజకీయ పరంగా గాని అన్ని విధాలుగా 50% వరకు అవకాశం కల్పించారని ఇచ్చిన వాగ్దానాలన్ని మన ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా మన ముఖ్యమంత్రివర్యులు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలలో డబ్బులును జమ చేస్తున్నారన్నారు. సంఘాల నాయకులు కోరిన విధంగా జ్యోతిరావు పూలే వారి విగ్రహా సెంటర్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నము చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు దీనజన బాంధవుడు, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. 197 సంవత్సరాల తర్వాత కూడా జ్యోతిబా పూలే జయంతి జరుపుకుంటున్నాం అంటే ఎంతటి గొప్ప మహా వ్యక్తి, ఎంత మంచి పని చేసి ఉంటే ఆయనను ఈ రోజు మనం స్మరించుకుంటామని ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేయడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో దాదాపు 2లక్షల 30వేల కోట్ల రూపాయలను దళారీ వ్యవస్థ లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడమే అందుకు తార్కాణం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తూ అందరినీ సమానంగా చూడడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న ఏదైనా చెప్తే మాటలతో కాకుండా చేతులతో చేసి నిరూపించే వ్యక్తి అన్నారు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ నాయకులు జొహరాపురంలో డా.బిఆర్.అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు చేయాలని అడుగగా, సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేయడానికి మున్సిపల్, ఆర్అండ్ బీ మరియు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, బిఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ వారి స్ఫూర్తితో మనము ముందుకు సాగుతూ వారి ఆశలను నెరవేర్చాలన్నారు. మనకు స్వాతంత్రం దాదాపుగా 75 సంవత్సరాలు అయ్యిందని, బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొరకు ఈ నాలుగు సంవత్సరాలలో దాదాపుగా రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందేలా లబ్ధిదారులకు నేరుగా అందించాలని ఉద్దేశంతో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందన్నారు. మన ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ లు, డివిఎంసి మెంబర్లు, మాజీఎంపీ బుట్టా రేణుక,వివిధ సంఘాల బీసీ ప్రజా సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ నాయకులు సత్యనారాయణమ్మ, గడ్డం రామకృష్ణ, నక్కల మిట్ట శ్రీనివాసులు, శేష్ఫణి, నగేష్, నాగేశ్వర యాదవ్, ఎం శ్రీనివాసులు, వివి రమణమూర్తి, లక్ష్మీ కాంతయ్య, ధనుంజయ ఆచారి, అడ్వకేట్ మురళి, గురుశేఖర్, బాల సంజన్న, కె.శివరాం, పట్నం రాజేశ్వరి, రామకృష్ణ శకుంతల, మోహన్, హేమంత్ గౌడ్, ఈశ్వరయ్య, హుస్సేన్, రాజు, రమణ, సోమేశ్, తిరుపాల్, బాబు, రాంబాబు, ఆనంద్, కృష్ణాజీరావు, మద్దిలేటి, సురేష్, బాబు, రేవతి కోటేశ్వరయ్య సుధారాణి తదితరులు పాల్గొని మహాత్మ జ్యోతిరావు బాపులే గురించి కొనియాడారు.