కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు మహాత్మ జ్యోతిబాపూలే
1 min read– విశ్వహిందూ పరిషత్ కర్నూలు నగర అధ్యక్షులు టిసి మద్దిలేటి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ఉన్న బిర్లా గేట్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఉ.9:00 గం.లకు పూలమాలలు వేసిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మధ్ధిలేటి మాట్లాడుతూ… దేశంలో కుల వివక్ష నిర్మూలన జరగాలని సత్యాగ్రహం చేసిన మహనీయుడు, సమాజంలో స్త్రీలు సగభాగమని వారు విద్యావంతులవ్వడం అత్యావశ్యకమని నినవించి, వారికోసం ఒక ప్రత్యేక పాఠశాలనే తెరిచిన గొప్ప మానవతావాది శ్రీ జ్యోతిబాపూలే…. 1827 ఏప్రియల్ 11 వ తేదీన సతారా జిల్లా లో పుట్టారు,తాను స్థాపించిన సత్యశోధన్ సంస్థ ద్వారా బుడుగు బలహీన వర్గాల వారి తరపున పోరాటం చేసి సమాజంలో బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యం పెరగడంలో ఎంతో కృషి చేశారని కొనియాడారు,నగర ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ మాట్లాడుతూ దాదాపు 133 సం.లు దాటినా ఇప్పటికీ మహానుభావుడైన జ్యోతిబాపూలే ను తలుచుకుంటున్నామంటే ఆయన ఎంతటి మహానుభావుడో అందరికీ అర్థం అవుతుందని ఈ సందర్భంగా మనందరం ఒక “ప్రతిజ్ఞ” చేయాలని సమాజం అంటరానితనాన్ని పూర్తి గా రూపుమాపే వరకూ మిశ్రమించబోమని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు, సత్సంగ కన్వీనర్ శేఖర్ శ్రీ వరసిద్ధి వినాయక ప్రఖండ సల్కాపురం బాబు సత్సంగ ప్రముఖ్ సాయినారాయణ, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.