PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈబిసి మహిళల ఆర్థిక ప్రగతే ‘ఈబిసి నేస్తం’లక్ష్యం

1 min read

– జేసీ సాయికాంత్ వర్మ
– మార్కాపురం బహిరంగ సభ నుండి ‘ఈబీసీ నేస్తం’ ద్వారా రెండవ విడత సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కడప : “ఈబీసీ నేస్తం”పథకం ద్వారా.ఈబిసి వర్గాల పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే.ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.అని జిల్లా జేసీ సి.ఎం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు.బుధవారం మార్కాపురం పట్టణంలో ఏర్పాటైన బహిరంగ సభ నుండి వీడియో కాన్ఫిరెన్సు ద్వారా.”ఈబిసి నేస్తం” లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15 వేల రెండవ విడత సాయం మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలునుండి జాయింట్ కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తోపాటు.రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ సలహాదారు పి.శివ ప్రసాద్ రెడ్డి,హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్,రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ గజ్జల వెంకట లక్ష్మీ, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ జి.రమణమ్మ,రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి లు హాజరయ్యారు.మార్కాపురం నుండి ముఖ్యమంత్రి కార్యక్రమ లైవ్ ప్రసారం ముగిసిన అనంతరం స్థానిక విసి హాలులో.”ఈబిసి నేస్తం” పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 33,087 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రెండవ విడతగా మంజూరయిన రూ. 49,63,05,000 ల మెగా చెక్కును గౌరవ అతిధులతో కలిసి.జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం.జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ.”ఈబిసి నేస్తం”ఈ పథకం ద్వారా.ఆగ్ర వర్గాల్లోని ‘ఓసీ’ వర్గాలకు చెందిన రెడ్డి బ్రాహ్మణ, వైశ్య,నాయుడు, సయ్యద్ తదితర మొత్తం 308 ఉప కులాల్లోని 45 నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ప్రభుత్వం అందించే ఈబిసి నేస్తం సాయంతో.జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడనున్నాయన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద మహిళ కూడా.సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేదే.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. మహిళా సాధికారతే.ప్రధాన ధ్యేయంగా అన్ని వర్గాల మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు.అర్హత ఉండీ లబ్ది చేకూరడంలో ఇంకనూ.ఏమైనా సమస్యలు ఉంటే సంబందిత శాఖ అధికారులను లేదా.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు 1902 కు కాల్ చేయవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ, మైనారిటీస్ కార్పొరేషన్ల ఈడి డా.వి.బ్రహ్మయ్య,సంబందిత సంక్షేమ శాఖాధికారులు, లబ్దిదారులయిన బ్రాహ్మణ, బలిజ,కాపు,ఒంటరి మహిళలు తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారుల అభిప్రాయాలు.వారి మాటల్లో.1.ఆర్ధిక సాయంతో పాటు.సామాజిక భద్రత ఇస్తున్నారు.ముఖ్యమంత్రి ఆర్థిక సాయంతోపాటు సామాజిక భద్రతను ఇస్తున్నారు.”ఈబిసి నేస్తం” పథకం సాయంతో.సమాజంలో మాకు గుర్తింపునిచ్చింది.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు మహిళల పాలిట వరంగా మారాయి.అమ్మఒడి, విద్యా దీవెన,వసతి దీవెన, పెన్షన్ పథకం,రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా పథకాలు అందుకోగలుగుతున్నాను.మహిళల ఆర్ధిక ప్రగతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే.- పి.ఉమా రాణి, 17వ డివిజన్,శముళ్లపల్లె, కడప.2.”ఈబీసీ నేస్తం” బతుకు నేస్తంగా మారింది.”ఈబీసీ నేస్తం” పథకం మా కుటుంబానికి బతుకు నేస్తంగా మారింది.జగన్న అమ్మఒడి, ఒంటరి మహిళ పెన్షన్ పథకాలతో పాటు.రుణమాఫీ సాయాన్ని కూడా అందుకున్నాను. ఊహించని రీతిలో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాం. అడబిడ్డల ఆర్థిక,సామాజిక ఎదుగుదలకు ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు.ఎం.గీతాంజలి,16వ డివిజన్, సింగపూర్ టౌన్ షిప్, కడప.3.జగనన్నకు మహిళల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.అగ్రవర్ణ మహిళల ఆర్థిక పరిస్థితులను కూడా గుర్తించి.సాయం అందిస్తున్న జగనన్నకు ధన్యవాదములు.ప్రభుత్వం అందించిన సాయాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టుకుంటున్నా. ఈబిసి నేస్తం తోపాటు.పెన్షన్, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ ఆసరా ఆర్థిక సాయం కూడా అందుకుంటున్నాను.మహిళా సాధికారత కు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రికి మహిళల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.సి.రాజేశ్వరి, సి.ఎం.ఆర్.పల్లి,కడప.4. సీఎం నమ్మకాన్ని రెట్టింపు చేస్తాం.వితంతు పెన్షన్ తోపాటు.ఈబిసి నేస్తం సాయం కూడా నాకు అందుతోంది. పేదవారికి సాయం అందించే పెద్ద మనసున్న నేత.మా ముఖ్యమంత్రి.”ఈబిసి నేస్తం” పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.ఆర్ధికంగా నిలదొక్కుకోగలమనే నమ్మకం మాలో రెట్టింపు అవుతోంది.మాపై ముఖ్యమంత్రి పెంచుకున్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసి చూపిస్తాం.అన్ని ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నాం. ఎం.పద్మావతమ్మ,శాస్త్రి నగర్, కడప.

About Author