PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడప గడపలో ప్రజల సమస్యల మొర

1 min read

– ఇంటి పట్టాలు ఇచ్చారు స్థలాలు చూపించారు మళ్లీ పట్టాలు వెనక్కి తీసుకున్నారు -సంతానమే లేదు విద్యా దీవెన,వసతి దీవెన నగదు పడినట్లు పత్రాల్లో వింత జమ -గడప గడపలో ఎండనూ సైతం లెక్కచేయని ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని మాసపేట పంచాయతీలో మూడవ రోజున కలమందలపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఎండనూ సైతం లెక్కచేయకుండా ముందుకు సాగారు.గురువారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కాసేపు విశ్రాంతి తదనంతరం మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈకార్యక్రమం సాగింది.గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా అందిన నగదు గురించి ప్రతి కుటుంబం దగ్గర ప్రజలకు ఎమ్మెల్యే వివరంగా తెలియజేశారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఎండను లెక్కచేయకుండా అన్న బాగున్నావా అక్క బాగున్నావా అంటూ మీ యొక్క దీవెనలు జగనన్న ప్రభుత్వంపై ఉండాలంటూ ఎమ్మెల్యే హుషారుగా ముందుకు వెళ్లారు.గ్రామంలో పలు సమస్యల పట్ల గడపగడపకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యేకు ప్రజలు వివరించారు.గ్రామానికి చెందిన వడ్డే రమణమ్మ రాముడు మాకు ఇంటి స్థలం బిల్డింగ్ కావాలని ఎమ్మెల్యేను అడిగారు.నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు వారందరికీ పెళ్లిళ్లు అయినాయి ప్రత్యేకంగా బియ్యం కార్డులు ఉన్నాయి.మా కుటుంబంలో పిల్లలను కలిపితే 14 మందిమి ఒకే చిన్న కుటుంబంలో నివసిస్తున్నాం.కానీ ఇంటి స్థలానికి,బిల్డింగు కు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వడం లేదని యనబోతుల ప్రకాష్ రావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.పల్లె జ్యోతమ్మ,పి.చాంద్ భీ,డి.దస్తగిరమ్మ లు మాట్లాడుతూ మాకు గతంలో ఇంటి పట్టా ఇచ్చారు ఇంటి స్థలం చూపించారు,కానీ తర్వాత మాకు ఇచ్చిన ఇంటి పట్టాను అధికారులు లాక్కున్నారని వారు ఎమ్మెల్యేను అడిగారు.ఓహెచ్ఎస్ఆర్ త్రాగునీటి ట్యాంకు శిథిలావస్థలో ఉందని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.నల్లమల సూరిబాబు,చరితమ్మ దంపతులకు ప్రభుత్వ పథకాల నుంచి పొందిన నగదు వివరాల గురించి ఎమ్మెల్యే అందజేసే పత్రంలో జగనన్న విద్యా దీవెన-8125 రూ.లు మరియు జగనన్న వసతి దీవెన 1550 రూపాయలు మీకు అందిందని పత్రం అందజేస్తూ ఉండగా మాకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అయిందని మాకు సంతానం లేదని మా ఇంట్లో ఎవరూ పిల్లలు లేరని నగదు మాకు వచ్చినట్లు ఎలా వస్తుందని సూరిబాబు,చరితమ్మ దంపతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.వెంటనే అక్కడున్న అధికారులను పిలిచి వీటిపై ఎమ్మెల్యే ప్రశ్నించారు.ఇండ్లు లేనిచోట సిసి రోడ్లు వేస్తున్నారు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని కాలనీవాసులు చాకలి సాయికుమార్,లలితమ్మ,మాల బుడ్డన్న ఎమ్మెల్యేను అడగగా సిసి రోడ్డుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ ఏఈ ప్రతాపరెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు.మరియు విద్యుత్ స్తంభాలు ఇంటి స్థలాలు గృహాల మంజూరు చేయాలనే వాటి గురించి ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎప్పటికప్పుడు ఆయా శాఖల సంబంధిత అధికారులను పిలిచి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.కుటుంబ సభ్యులు మీకు చెప్పక ముందే మీకు అప్పజెప్పిన కుటుంబాలలో ఏ కుటుంబానికి ఏఏ పథకాలు అవసరమో వాటిని గుర్తించి 100% పథకాలు అందే విధంగా చూడాలంటూ కొందరు వాలంటీర్లపై ఎమ్మెల్యే అసహన వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో నందికొట్కూరు రూరల్ సిఐ జి. సుధాకర్ రెడ్డి,వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి,మిడుతూరు,బ్రాహ్మణకొట్కూరు,ఎస్సైలు మారుతి శంకర్,ఓబులేష్,వైసీపీ నాయకులు కమతం వీరారెడ్డి,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఏఓ పీరు నాయక్,ఈవోఆర్డి ఫక్రుద్దీన్,పంచాయతీ కార్యదర్శి అస్రఫ్ భాష,వీఆర్వో రాఘవేంద్ర,వివిధ గ్రామాల నాయకులు సాదిక్,మహేష్,జాన్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author