‘పి ఎం సి సి – కిసాన్ అన్మోల్ క్యాంటీన్ కార్డ్” పథకం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: దేశానికి రైతే వెన్నెముక అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని నరేంద్ర మోడీ రైతుల పక్షపాతిగా ఎన్నో పథకాలను ప్రారంభించడం జరిగింది అని ఇందులో భాగంగా పి ఎం సి సి-కిసాన్ అన్మో్ల్ క్యాంటీన్ కార్డు పథకం (ఈ- అన్నదాత) రైతులు సహాయ కేంద్రమును ఆంధ్ర ప్రదేశ్ అంతటా నిర్వహించటానికి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారు సేవా శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా( ఈ-అన్నదాత) కార్డులను రైతులకు అందించటానికి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అవడం జరిగిందని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయుష్ ఇన్ఫోసిస్ సర్వీసెస్ అధినేత మంచూరి సోమశేఖర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మండలంలో అన్నదాత కార్డు పొందిన ప్రతి ఒక్క రైతులకు 5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని, ప్రమాద బీమా కింద 25 లక్షల వరకు వర్తిస్తుందని రైతు కిసాన్ కార్డులో 500 నుండి అంతకంటే ఎక్కువ రైతాంగానికి ఉపయోగపడే పనిముట్లు కొనుగోలు చేస్తే 40% రాయితీ లభిస్తుందని అంతేగాక రైతులకు కావలసిన మరెన్నో సదుపాయాలను, (ఈ- అన్నదాత) కార్డు ద్వారా సన్నా, చిన్నకార, రైతులందరూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకో వాలని ఆయన కోరారు . ఈ కార్యక్రమంలో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ సిబ్బంది ,మధు, జె. సుధాకర్, గోవర్ధన్ ,అరుణ ,కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.