వైఎస్సార్ భీమా చెక్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ 15వ వార్డుకు చెందిన సుందర్ రాజు సోదరుడు ప్రభుదాస్ గత వారము అనారోగ్యంతో మృతిచెందారు. గురువారం 15వ వార్డు ఇంచార్జ్ కౌన్సిలర్ బ్రహ్మయ్య చారి , సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వైఎస్సార్ భీమా ఆర్థిక సహాయం రూ.10 వేలు కుటుంబ సభ్యులు సుందర్ రాజు కు అందజేశారు. ఆర్థిక సహాయం మంజూరు కు కృషి చేసిన వైయస్సార్ పార్టీ నాయకులు బ్రహ్మయ్య కు మృతిని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.