భారత రాజ్యాంగం…ప్రపంచానికే ఆదర్శం..
1 min readకల్లూరు తహసీల్దార్ రమేష్
ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి
పల్లెవెలుగు వెబ్: భారత రాజ్యాంగ నిర్మాత…. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బిఆర్. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి.. డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్, ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ డా.బిఆర్. అంబేద్కర్ జీవితం.. ఎందరికో ఆదర్శమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మహనీయుడు డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.