INTSO లో శ్రీచైతన్య విద్యార్థుల విజయభేరి
1 min read– స్థానిక బుధవారపేట లోని శ్రీ చైతన్య పాఠశాలలో గత జనవరి లో విజయవాడ కు చెందిన భారత జాతీయ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ( INTSO) వారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రెండవ స్థాయి పోటీ పరీక్షలలో 105 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానాచార్యులు మౌనిక తెలిపారు .శనివారం ఉదయం పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభకు శ్రీ చైతన్య పాఠశాలల ఏజిఎం సురేష్ ,ఆర్ఐ వి .వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరైనారు .ఈ సందర్బంగా ఏజిఎం సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి పోటీ పరీక్షలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు .ఆర్ఐ వి .వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యార్థులు రాసే పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని తెలిపారు .పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏజిఎం అభినందించారు .అనంతరం పోటీ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసారు .ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానాచార్యులు మౌనిక ,డీన్ వీరయ్య ఆచారి ,ప్రైమరీ ఇంచార్జి రమ్య ,ఉపాధ్యాయులు ,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు .