PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం అని మున్సిపల్ కౌన్సిలర్ కాటేపోగు చిన్న రాజు అన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనకు శ్రీరామరక్ష అని అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఏబీఎం పాలెం కాలనీలో జగనన్నే మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సచివాలయ కన్వీనర్, వాలంటీర్లు, గృహసారథులతో కలిసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి కృషి చేశారన్నారు. పేద వర్గాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల వంటి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద వర్గాల సంక్షేమం కోసం రెండు లక్షల కోట్లకు పైగా నిధులను మంజూరు చేసి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని కొనియాడారు. మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. ఇప్పుడు వరకు చూసామన్నారు. సంక్షేమ పథకాలు కింద డబ్బులు నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేయడం సంతోషకరమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నడుం బిగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్, గృహసారథులు నానమ్మ , ఏసన్న, సుధీర్, మానస, రాణేమ్మ ,లక్ష్మమ్మ , కార్యకర్తలు ,నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

About Author