NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత కుటుంబానికి ఏపీ ఎరుకల సేవా సంఘం చేయూత

1 min read

-రూ.32 వేలు ఆర్థిక సహాయం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన బాదిత కుటుంబానికి ఏపీ ఎరుకల సేవా సంఘం ఆర్థిక చేయూత అందించింది. మహానంది మండలం గాజుల పల్లె గ్రామం బుచ్చమ్మ తోటకి చెందిన ఎరుకల శ్రీరాముల వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏపీ ఎరుకల సేవా సంఘం సభ్యులు తోటి ఎరుకల కుల కుటుంబానికి సాయపడాలని భావించి వారి కుటుంబానికి ఏపీ ఎరుకల సేవా సంఘం బనగానపల్లి మండల కమిటీ తరఫున రూ. 32 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముల వెంకటరమణ అకాల మరణం ఎంతో బాధాకరమని, భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలిపారు. కష్టాల్లో ఉన్న ఎరుకల కుల బంధువులను ఆదుకునేందుకు ఏపీ ఎరుకల సేవా సంఘం తనవంతు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎరుకల సేవా సంఘం జిల్లా సెక్రటరీ డేగల విఘ్నేష్, బనగానపల్లి మండల కమిటీ సభ్యులు ఈసారి ఎల్లయ్య, ఈసారి పెద్ద రాముడు, ఈసారి కుమార్, ఈసారి శ్రీనివాసులు, ఈసారి సురేష్, పోతురాజు నడిపి సుంకన్న, కాలింగిరి శ్రీరాములు, కాలింగిరి రమేష్, ముని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author