అభివృద్ధి కనపడలేదా బహిరంగ చర్చకు మేము రెడీ మీరు రెడీనా.. వైసీపీ
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు నారా లోకేష్ కి ,డోన్ ఇన్చార్జి ధర్మారం సుబ్బారెడ్డికి అభివృద్ధి కనపడలేదా బహిరంగ చర్చకు మేము రెడీ మీరు రెడీనా అని రాష్ట్రం మిట్ చైర్మన్ శ్రీరాములు డోన్, ప్యాపిలి వైసిపి నాయకులు సవాలు విసిరారు. నిన్న జరిగిన లోకేష్ యోగలం పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ,ఆర్థికమంత్రి బుగ్గన రాజారెడ్డి గురించి డోన్ నియోజకవర్గం అభివృద్ధి గురించి వైసిపి నాయకులను ఇప్పుడు ప్రచారాలు మాట్లాడారు.ఈసందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని వైసీపీ కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎం సంక్షేమం పథకాలు పెదప్రజల కోసం బటన్ నోక్కితే ఇచ్చేది కొంత దోచుకునేది కొండంతా అని లో బటన్ నొక్కుతాడని అంటారా, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల పక్షవాతి కాబట్టే ప్రజల కష్టాలను చూసి సరిపడే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వారు హితవు పలికారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డిని అభివృద్ధి కోసం అప్పులు చేస్తుంటే అప్పుల ఆర్థిక శాఖ మంత్రి అంటారా, ఆయన ఇంటికి ఏమన్నా తీసుకెళ్తున్నాడా, అభివృద్ధి కోసమే కదా అనితేలుసుకోవాలన్నారు. ఇంకా రైతు శ్రేయస్సులు కోరే మంత్రి రాజారెడ్డి సాగు నీరు, తాగునీరు కావాలని 200 కోట్లతో 68 చెరువులకు నీరు నింపే కార్యక్రమం చేపట్టారని, 50 సంవత్సరాల నుండి కే ఈ, కోట్ల కుటుంబం వారు డోన్ మండలంలోని గుండాల చెన్నకేశవ స్వామి కి టెంకాయలు కొట్టి దర్శనం చేసుకుంటున్నారు ,కానీ ఆలయ అభివృద్ధి ఎప్పటికీ పట్టించుకోలేదు లాంటిది ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి కోసం కోట్లు నిధులతో చెన్నకేశవ స్వామి దేవాలయం అభివృద్ధి చేస్తుంటే, గుప్తనిధుల కోసం అభివృద్ధి పనులు చేస్తున్నారని అంటున్నారు ,తెలుగుదేశం నాయుకులకు నోరు ఎలా వస్తుందని వీటి వీటిని విన్న ప్రజలు తప్పుడు మాటలుగా విని సభలో ప్రజలు వెనక్కి తిరిగి వెళ్లారన్నారు. డోన్ నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూ కబ్జాలు వైసిపి నాయకులు చేస్తున్నారని అంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆలాంటీ తప్పుడు పనులు చేయడం వాళ్లకే సాధ్యమని తప్పులుంటే చూపియండి.లేదా బహిరంగ చర్చకు రండి మిరు రడీగా ఉన్నారా, అంతేకానీ డోన్ నియోజకవర్గం అభివృద్ధిని చేస్తుంటే ఓర్వలేక టిడిపి వారు బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని వైసిపి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు రెడ్డి పుల్లారెడ్డి, జంగం చంద్రశేఖర్, బోర మల్లికార్జున,సోమ శేఖర్ ,నాగభూషణ్ రెడ్డి, పర్వతం వాసిరెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి ,డోన్ మాజీ చైర్మన్ రామచంద్రుడు ,డోన్ వైసీపీ నాయకులు పోస్ట్ ప్రసాద్, దినేష్ గౌడ్ ,శ్రీనివాసరెడ్డి రెడ్డి ,రఘునాథరెడ్డి ,చిన్న రామంజి ,రాజా మురళి కృష్ణ, వలి ,బషీర్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.