PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి : రేడియం నూర్

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: తన 6 వ వార్డు ప్రజలు సోమవారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని 6 వ వార్డ్ టీడీపీ ముఖ్య నాయకులు రేడియం నూర్ విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా రేడియం నూర్ మాట్లాడుతూ మాజీ MLA బుడ్డా రాజశేఖరరెడ్డి గారు సహకారంతో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ ఆద్వరంలో ఈ క్యాంప్ నడపడం జరుగుతుందన్నారు. తన వార్డు ప్రజల ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని బీపీ,షుగర్, గుండెకి సంబంధించిన ఈసీజీ, జ్వరం,దగ్గు,ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు,చిన్న పిల్లలకు ఏ సమస్యలు ఉన్న, మరియు కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు ఉచిత0గా ప్రముఖ డాక్టర్లచే పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వబడును. తప్పకుండా తన వార్డుకు సంబంధించిన ప్రతిఒక్కరు తమ ఆరోగ్య సమస్యల్ని డాక్టర్స్ కి తెలియపరచి ఉచితంగా మందులు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. తన వార్డు ప్రజల కోసం రానున్న రోజుల్లో మహిళల ఉపాధి కోసం ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

About Author