SBIలో అకౌంట్ ఉన్నవారికి చేదువార్త..
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ బ్యాంక్.. తమ కస్టమర్లకు చేదువార్తను తెలిపింది. జూలై 1 నుంచి కొత్త సర్వీసు చార్జీలు వసూలు చేయనున్నట్టు తెలిపింది. నగదు విత్ డ్రా, చెక్ బుక్ మీద పరిమితులు విధించింది. జీరో బ్యాలెన్స్ ఖాతా కలిగిన వారు ఏదైన ఎస్బీఐ బ్యాంకు నుంచి నెలకు నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అంతకంటే ఎక్కవ సార్లు విత్ డ్రా చేసుకుంటే.. ప్రతిసారి 15 రూపాయలతో పాటు, జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్బీఐ ఏటీఎం కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.