కేంద్ర ద్రోహానికి వ్యతిరేకంగా పోరు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం, వివక్షపూరిత విధానాలు, ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడాలని, మతోన్మాదాన్ని నిలువరించడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నరసింహ నాయక్ అన్నారు. సోమవారం పట్టణంలోని సుదర్శన భవనం నందు ప్రచార యాత్ర జయప్రదానికై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి కానీ, రాజీ పడటం ద్వారా కాదన్నారు. కావున కేంద్ర బిజెపి ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై సిపిఎం,సిపిఐ పార్టీలు ఉమ్మడి ప్రచార బేరి కార్యక్రమం ఈనెల 18వ తేదీ నుంచి ఆత్మకూరు మండలంలో నిర్వహిస్తున్నామన్నారు. కావున బిజెపి ద్రోహానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరుకు సిద్ధం కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సి.వెంకటేశ్వర్లు, మాభాష, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.