PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి భీముడు నాయక్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పెద్ద కబేలా వీధిలోనీ శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అగ్నిమాపక విన్యాసాలు ప్రదర్శిస్తూ అగ్నిమాపక కరపత్రాలను విద్యార్థులకు పంచుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు అగ్ని మాపక అధికారి భీముడు నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కరస్పాండెంట్ తాజుద్దీన్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

About Author