PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

24న జరిగే రాయలసీమ కర్తవ్యదీక్షను విజయవంతం చేయండి

1 min read

– రవికుమార్, రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక రాయలసీమ విద్యార్థి,యువజన పోరాట సమితి కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాలకొమ్మ అశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాయలసీమ ఉద్యమ నాయకులు రవికుమార్, వివి నాయుడు,మదాసి కురువ సుంకన్న ముందుగా రాయలసీమ కర్తవ్యదీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమ నీళ్లు,నిధులు,నీయామకాలకై ఈనెల 24న రాయలసీమ ఉద్యమ నేత, రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే రాయలసీమ కర్తవ్యదీక్షను ప్రతి రాయలసీమ బిడ్డ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అలాగే వారు మాట్లాడుతూ కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల తుంగభద్రపై ఆధారపడ్డ రాయలసీమ జిల్లాలు పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉందని ఎల్లెల్సీ, హెచ్ఎల్సీ,ఆర్డీఎస్ కింద ఉన్న రాయలసీమ ఆయకట్టు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టుపై తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, అలాగే సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి స్థానంలో బ్రిడ్జికం బ్యారేజ్ ను నిర్మించాలని, రాయలసీమ లోని పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాలని, రాయలసీమ వలసలను నివారించాలని,రైతుల ఆత్మహత్యలను నివారించాలని, పై డిమాండ్లతో జరుగుతున్న రాయలసీమ కర్తవ్యదీక్షను రాయలసీమ ప్రతి పౌరుడు వారి వారి కర్తవ్యం గా భావించి ఉదయం తొమ్మిదిగంటల నుండి సాయంత్రం ఐదుగంటల వరకు జరిగే దీక్షకార్యక్రమంలో పాలుపంచుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి నాయకులు ఎర్రకోట మల్లప్ప, వాల్మీకి సీతారాముడు,కురువ రమేష్,జగదీష్, సత్యవతమ్మ,రషీద తదితరులు పాల్గొన్నారు.

About Author