హిందూ ఆలయభూములను కబ్జా చేసిన వారిని వెంటనే కాలిచేయించాలి
1 min read– గోరంట్ల రమణ విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉ.11:00 గం.లకు కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న “స్పందన” కార్యక్రమంలో కర్నూలు జిల్లా,కర్నూలు మండలం పరిధిలోని దేవాదాయ – ధర్మాదాయ శాఖ పరిధిలోని,జోహరాపురం లోని హిందూ దేవాలయం నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆస్థి గా ఉన్న భూమి 7. 72 సెంట్ల భూమిని కమ్యూనిస్ట్ పార్టీ(సీ.పీ.ఐ) కార్యకర్తలు దౌర్జన్యంగా జెండాలు పాతి ఆక్రమించిన విషయాన్ని గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతిపత్రం అందించి వారిని వెంటనే ఖాళీ చేయించాలని కోరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కర్నూలు జిల్లా ,కర్నూలు మండలం జోహరాపురం గ్రామంలో 2 వందల సం.ల క్రితం వెలసిన పురాతన చారిత్రక ఆలయం శ్రీ నీలం కంఠేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమి సర్వేనెం : 123 విస్తీర్ణం ఎ. 7.72 సెంట్ల భూమి కర్నూలు నుండి నంది కొట్కూరు వెళ్ళే జాతీయ రహదారిలో మల్లారెడ్డి వెంచర్ వెనక,సెయింట్ జోసెఫ్ బాలికల జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న సదరు భూమి ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం సుమారు 60 కోట్ల రూపాయల విలువ గలిగిన భూమిని దేవాలయం లో నిత్యపూజా కైంకర్యాలకు,ధూపదీపాలతో నైవేద్యాలకూ,ఆలయ సంపూర్ణ నిర్వహణకు దాతలు ఇచ్చిన భూమిని ప్రభుత్వం దేవాదాయ – ధర్మాదాయ శాఖ ద్వారా సదరు భూమికి తగిన రక్షణ కల్పించి,దాని ఆదాయంతో దేవాలయాన్ని నడిపించే బాధ్యతను కలిగి ఉన్నది, 22/3/2023 న సంబంధిత భూమిని బహిరంగ వేలంలో బి. ధర్మేంధ్ర కుమార్ గారి శ్రీమతి బి.ఉషాదేవి గారు 3 సం.ల కౌలుకు 82,000 రూపాయల కౌలుకు తీసున్నారు.ఐతే ఆ భూమిని దేవుడినిఏమాత్రం నమ్మని నాస్తికులైన కమ్యూనిష్టు పార్టీ (సీ.పీ.ఐ) కి చెందిన కార్యకర్తలైన ముస్లింలు,క్రైస్తవులు,హిందువులు సదరు హిందూ దేవాలయం నీలకంఠేశ్వర స్వామి భూమిని దౌర్జన్యంగా 8/4/23, శనివారం రోజున ఉ.10:00 గం.లకు ఆక్రమించి (కబ్జా చేసిన) తమ జెండాలు పాతి ఇక్కడే తమకు పట్టాలు ఇవ్వాలని సామూహికంగా టెంట్లు వేసుకుని ” ధర్నా” నిర్వహిస్తున్నారు ఈ విషయం అడగడానికి వెళ్ళిన ఆలయకమిటి సభ్యులను,దేవదాయశాఖ ఉద్యోగస్తులపై నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టటం జరిగింది.అంతేకాక సదరు కౌలుకు తీసుకున్న వ్యక్తులను పొలంలోకి రానీయక దౌర్జన్యం చేస్తూ సంబంధిత ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు.మహమ్మదీయులకు సంబంధించిన వక్ఫ్ భూములను గానీ,క్రైస్థవులకు చెందిన భూములను గానీ ఆక్రమించే ధైర్యం లేక కేవలం హిందూ దేవాలయాల సంబంధించిన ఆస్తులను ఆక్రమిస్తే అడిగేవారు లేరనే ధీమాతో ఉన్న సదరు కమ్యూనిష్టు (సీ.పీ.ఐ.) ఆక్రమణదారులను వెంఠనే నీల కంఠేశ్వర స్వామి ఆలయ భూమిని బేషరతుగా ఖాళీ చేయించి దేవదాయ శాఖ కు తిరిగి స్వాధీనం చేయాలని, హిందూ ఆలయాలకు సంబంధించిన ఒక్క ఇంచు భూమి కూడా దురాక్రమణ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ సహించేది లేదని,అవసరమైతే విశ్వ హిందూ పరిషత్ ఈవిషయంలో జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తుందని హెచ్చరిస్తున్నామని అన్నారు.జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ జోహరాపురం గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం భూములను కమ్యూనిష్ట్ ( సీ.పీ.ఐ.) ” కబ్జా ” చేసిన విషయంలో గౌ.కలెక్టరు గారితో పాటు కర్నూలు పోలీసు అధికారుల “స్పందన” లో అదనపు పోలీసు అధికారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగిందని, సదరు పోలీసు అధికారులు తగినంత ” పోలీసు జట్టు” ను తీసుకుని దేవాలయం భూమిని కబ్జా చేసిన వారిని వెంటనే ఖాళీ చేయించడమే కాక ఇలా దేవుని మాన్యం దురాఆక్రమణ చేసిన వారిని విచారించి కఠినంగా శిక్షించాలని,శ్రీ నీల కంఠేశ్వర ఆలయం భూములను బేషరతుగా కాపాడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,కోశాధికారి సందడి మహేష్, విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ,విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహకార్యదర్శి శివప్రసాద్,కోశాధికారి ఏ.శ్రీనివాస రెడ్డి, జిల్లా ప్రసార,ప్రచార కన్వీనర్ రామకృష్ణ, నగర ఉపాధ్యక్షులు కృష్ణపరమాత్మ, సత్సంఘ కన్వీనర్ శేఖర్,బజరంగ్ దళ్ నగర కన్వీనర్ భగీరథ, నగర కో – కన్వీనర్ నాగరాజు,అరుణ్ కుమార్,ప్రఖంఢ కార్యకర్తలు గిరిబాబు,భాస్కర్, సత్యవేలు,సాగర్, దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి నక్కమిట్టల శ్రీనివాసులు,ఓంకారం,వెంకాయపల్లె కార్యకర్తలు ఎల్లరాజు,పసుపల కిశోర్ తదితరులు పాల్గొన్నారు.