ప్రభుత్వం…దిగిరావల్సిందే..!
1 min readన్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందే…
ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి
ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించిన ఉద్యోగులు
పల్లెవెలుగు వెబ్:ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు పోరాటం ఆగేది లేదన్నారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి. ఏపీజేసి అమరావతి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంటాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కె.వై.కృష్ణ నాయకత్వంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. సీపీఎస్..జీపీఎస్ వద్దు ..పాత పెన్షన్ ముద్దు అంటూ ప్లే కార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోన కష్టకాలంలో ముందుండి (ఫ్రంట్లైన్) సేవలు అందించామని, అటువంటి ఉద్యోగుల సేవలను గుర్తించకుండా..ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా… అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు… ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి.. సేవలు చేశామని, అయినా తమపై కక్ష సాధింపు చర్యలు తగదని విమర్శించారు.
ఎండను సైతం…:
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం… ఎండను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి అభినందనలు తెలిపారు గిరికుమార్ రెడ్డి, వై.కృష్ణ. ఉద్యోగులు ఐక్యతతో పోరాడితేనే… డిమాండ్లు సాధిస్తామన్న గిరికుమార్ రెడ్డి… రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. ధర్నాలో సభ్య సంఘాల నాయకులు, నాగరమణయ్య, రవీంద్రారెడ్డి, శంకర్ నాయక్, శోబసువర్ణమ్మ, సూరిబాబు, ప్రతాప్ ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎవి రెడ్డి, శ్రీనివాసులు, CPS నాయకులు రామానాయుడు, వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, క్లాస్ IV ఉద్యోగుల సంఘం, VROలు, VRAలు, ఔట్సోర్సింగ్ ,కాంటాక్ట్ , CPS employees, and సభ్య సంఘాల ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మరియు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.