భూసేకరణ పనులను వేగవంతం చేయండి
1 min read– మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భూసేకరణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీ ప్రాంతాలలో ప్రభుత్వాలకి అవసరం ఉన్న భూములను భూసేకరణ , ల్యాండ్ కన్వర్షన్, తదితర కార్యక్రమాలను వేగుంతం చేయాల్సిందిగా సంబంధిత కలెక్టర్ లను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని గూడూరు నగర పాలక పంచాయతీలో మురుగునీటి శుద్ధ జలాల ప్లాంట్ కొరకు గాను ఒక ఎకరా 52 సెంట్లు భూమిని గుర్తించామని వీటికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలో సమర్పిస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారికి కలెక్టర్ వివరించారు.