పేదవారి ఫ్రీజ్.. మట్టికుండ…!
1 min read– మట్టి కుండ నీళ్లు.. ఎంతో మేలు…
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. అయితే బయట వేడి వాతావరణానికి చల్లని నీరే ఎక్కువగా తాగుతుంటాం. మరి ఈ ఈ పరిస్థితుల్లో ఫ్రిజ్ నీళ్లకు మొగ్గు చూపకుండా మట్టి కుండలో నీళ్లు తాగడం చాలా మంచిది. ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది..
మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. కుండకున్న పోరస్ స్వభావం నీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసి, నీటిని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది..
పిహెచ్ స్థాయిలను స్థిరపరుస్తుంది..
కుండలో ఉంచిన నీటి పిహెచ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మట్టిలో ఉండే స్వభావాలు నీటి ఆమ్లతను తటస్థీకరిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ బలంగా మారి, వేసవిలోతరచూ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.చల్లటి నీటి కోసం ఫ్రీజ్, వాటర్ ప్యూరిఫైర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం కంటే మట్టి కుండలో నిల్వ చేసుకుంటే నీరు సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవేకాకుండా మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు వున్నాయి.
తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది..గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. వడదెబ్బ సమస్య నుంచి రక్షణ పొందాలనుకుంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు తాగడమే మంచిది.మట్టిలో ఉండే వివిధ రకరకాల విటమిన్స్, మినరల్స్ అందులో నిల్వ ఉంచిన నీటికి చేరి శరీరానికి మేలు చేస్తాయి.ఫ్రిజ్ నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అధిక బరువు, ఆస్తమా వంటి సమస్యల బారిన పడతారు. కానీ, మట్టి కుండలోని నీటిని తాగితే, వేసవి తాపం తీరడమే కాక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కుండలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఈ కాలంలో రోజూ కుండ నీటిని తాగితే పొట్ట సమస్యల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు.వేసవిలో చెమట వల్ల చర్మం జిడ్డుగా తయారై చర్మ ‘సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుండ నీళ్లు తాగితే ఆ సమస్యల నుండి దూరం కావచ్చు. ముట్టి కుండ నీరు బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు త్రాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.