స్టిక్కర్ల ప్రభుత్వం… అబద్దాల ప్రచారం..!
1 min readప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు…
ప్రాజెక్టుల నిర్మాణం లేదు… అభివృద్ధి లేదు..
మంచి చేశామంటూ…ప్రగల్బాలు.
బీజేపీ జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి
పల్లెవెలుగు: కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా… రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదని, కానీ తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. కేంద్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి… అభివృద్ధి మరిచిన వైసీపీ ప్రభుత్వం.. అబద్దాలు ప్రచారం చేస్తూ స్టిక్కర్లు ప్రభుత్వంగా మారిందని ఎద్దేవ చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. పార్థసారధి మాట్లాడారు. స్టిక్కర్ల కోసం పెడుతున్న ఖర్చుతో…. రాయలసీమలో చిన్న సాగునీటి ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు… ఫీజు రీయంబర్స్మెంట్ లేదు…ఉద్యోగులకు న్యాయం చేయలేదు… జగనన్న ఇల్లు లేదు… ఏం చేశారని … ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికిస్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. మద్యం ధరలు.. కరెంటు చార్జీలు.. నిత్యావసర ధరలు ఇలా… దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ధరలు పెరిగిపోయాయని…. ఇదంతా జగనన్నకు సంబంధం లేదంటూ దుష్ప్రచారం చేయడం ఏమిటని విమర్శించారు.