చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
1 min read– వేసవిలో దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి..
– డిప్యూటీ మేయర్ నూక పెయ్యి సుధీర్ బాబు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు , వడగాల్పులు నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర కార్పొరేషన్ పరిధిలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. మంగళవారం ఉదయం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం స్థానిక శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల కూడల వద్ద చలివేంద్రాలను ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ వేడిని బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అందరూ పాటించాలని అన్నారు. నగరంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు అసోసియేషన్ వారు ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపెయి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్, ఎం. ఎం.ఆర్ పెదబాబు, మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ కొండలరావు, ట్విట్టర్ హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.