PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ కట్టడాలను ఆపాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని ,ఈ భూకబ్జా బకాసురులుతమ తమ రిజిస్ట్రేషన్ మార్చుకునివీటిని ఇండ్ల స్థలాలుగా చేసి లక్షల కు అమ్ముకొని లక్షలు లక్షలు దండుకుంటున్నారు. అని చెప్పేసి ఈరోజు ప్రచార భాగంలో సిపిఐ పార్టీ 54 సర్వే నెంబర్ను సందర్శించడం జరిగినది. ఈ 54 సర్వేలోఇదివరకే అక్కడ ఉన్న మెకానిక్లకు వారందరికీ ఆటోనగర్ కోసం అని చెప్పేసి అందరికీ పట్టాలి ఇవ్వడం జరిగినది. ఈ పటాలు ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు భూకబ్ జాదారులు ఆక్రమించి దానిపైన అక్రమ కట్టడాలు కడుతున్నారు. ప్రధాన రహదారిగా ఉన్న దానిని పూడ్చి వంకలో మట్టితోలి, వంకలో కొత్త రహదారి ఏర్పాటు చేసి, దీనిపైన అక్రమ కట్టడం కడుతున్నారు. దీనిపైన పలు దఫాలుగా ఇప్పటికే నలుగురు ఎమ్మార్వో లను కలవడం జరిగింది నలుగురు ఎమ్మార్వో లుకూడా అది ఖాళీ స్థలం చెప్పడం జరిగింది .కానీ ఇప్పుడు దాని మీద అక్రమ కట్టడం కడుతుంటే గనుక ఏ అధికారులు కనబడలేదా అని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది వరకు ఎస్ఆర్బిసిలోదళితులు తమకు ఇచ్చిన పట్టాలు స్థలంలో ఇల్లు నిర్మాణం చేపడతా ఉంటే ప్రభుత్వ అధికారులు ఇవి అక్రమ కట్టడాలని చెప్పేసి జెసిబి లతో ఆ కట్టడాలను తొలగించడం జరిగింది. మరి ఈ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేకపోతే వారికి ఏమైనా ముడుపులు అందాయా అని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది .దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ కట్రాలను ఆపకపోతే సిపిఐ పార్టీగా భవిష్యత్తులో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఐ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది .కావున అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి ఎక్కడైతే భూ బకాసుర్లు కబ్జాలు చేసి భూములపైన అక్రమ కట్టడాలు కడుతున్నారో వాటన్నిటిని ప్రభుత్వ ఆధీనం లోనికి తీసుకొని గూడు లేని నిరుపేదలకు ఆ స్థలాలను పంచి వారికి ఒక గూడు నిర్మించాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేని ఎడల భవిష్యత్తులో ఎవరికైతే గూడు లేదో వారందరిని సమీకరించి భవిష్యత్తులో పోరాట ఉదృతం చేస్తాం . ఎవరైతే రాజకీయ నాయకులు ఈ గూడు లేని నిరుపేదలకు సహకరించరో వారికి రాజకీయ సమాధి కడతారు ప్రజలు అని చెప్పేసి సిపిఐ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఏ. శివయ్య డి .శివ బాల కృష్ణ, కాలింగ్ రాముడు ,సిపిఐ నాయకులుశివ నాగయ్య, ఖాదరు,కుళాయప్ప, ఏఐటీయూసీ నాయకులు కుళాయి స్వామి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author