అట్టేకల్, ఐనకల్ గ్రామస్తులకు కృతజ్ఞతలు
1 min readసర్పంచ్ జోగులతా శ్రీ
పల్లె వెలుగు, ఆస్పరి
మండల కేంద్రమైన అట్టేకల్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగు లతాశ్రీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 240 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు. మెజారిటీ ఇచ్చిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ఎన్నటికి మరువలేమని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అట్టేకల్ కొత్త గ్రామపంచాయతీ అని కొత్త అభ్యర్థిగా తనకు మొదటి సారి ప్రాధాన్యమిచ్చి గెలిపించడం సంతోషంగా ఉందన్నారు