కడప రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ
1 min read– జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్
– విచారణలో ఉన్న పెండింగ్ కేసులను త్వరగతిన పూర్తి చేయాలి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: విచారణలో ఉన్న పెండింగ్ కేసులలో విచారణ త్వరగా తిన పూర్తి చేయాలని, అలాగే అరికట్టేందుకు గస్తి ముమ్మురం చేయాలని, నాటు సారా ,అక్రమ మద్యం , ఇసుక క్రమ రమణా నిషేధించాలని గుట్కాలపై దాడులు నిర్వహించాలని ఎస్పీ కేకే అన్బు రాజన్ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి కి సూచించారు, చెన్నూరు పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీపోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డి ని ఆదేశించారు, అలాగేపోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు,అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు, విమెన్ హెల్ప్ డెస్క్ రిసెప్షన్ ను పరిశీలించి మహిళా పోలీస్ సిబ్బంది తో మాట్లాడారు, మహిళల భద్రత కు పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ పై అవగాహన కల్పించి డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్టర్డ్ యూజర్ గా నమోదు చేసుకునేలా వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు,పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పరిశీలించి త్వరగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని డిస్పోజల్ చేయాలని ఆదేశించారు,విచారణలో ఉన్న పాత పెండింగ్ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కడప రూరల్ సి.ఐ అశోక్ రెడ్డి, ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డికి సూచించారు, ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.