అక్రమ కట్టడాల ఆపకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.జాతీయ సమితిలో పిలుపులో భాగంగా బనగానపల్లె పట్టణంలో ఆరవ రోజు చంద్రబాబు నాయుడు నగర్ లో పర్యటించడం జరిగినది. ఈ పర్యటించిన తరుణంలో సమీపంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను సందర్శించడం జరిగినది, సందర్శించిన తరుణంలో ఆ ఆవరణలో గల ప్రభుత్వ స్థలాలను దళారులు ఆక్రమించి అక్రమ కట్టడాలను కడుతున్నారు. దీనిపైన అధికారులు గాని రాజకీయ నాయకులు గానీ ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. దీనిపైన ఆర్ అండ్ బి అధికారులు నిమ్మకు నిరీత్తినట్లు ఉన్నారు, మా అనుమానం ప్రకారం ఆర్ అండ్ బి అధికారులకు ముడుపులు అందినవా లేక వీరి కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారా, అని సిపిఐ గా ప్రశ్నించడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొందరు నాయకుల పేరు చెప్పుకొని ప్రభుత్వ స్థలాలను భూకబ్జా చేస్తున్నారు. కావున పై అధికారులు నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాము. అనంతరం స్థానిక మండల తహసిల్దార్ గారికి ఇక్కడ జరుగుతున్న భూకబ్జాల గురించి అక్రమ కట్టడాల గురించి 54 సర్వే, 153 సర్వే అలాగే దద్దనాల చెరువు వాగు కి ఇరువైపులా ఆక్రమించి ఉన్న స్థలాల గురించి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ అక్రమ కట్టడాలపై స్పందించకపోతే అవసరమైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గర దీక్షకు సిద్ధమవుతామని సిపిఐ నాయకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సుబ్బారెడ్డి ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శివ బాలకృష్ణ, సిపిఐ జిల్లా సభ్యులు ఏ శివయ్య, కలింగిరి రాముడు,సిపిఐ మండల నాయకులు ఖాదర్, శివ నాగయ్య, కుళ్లాయప్ప, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.