మనమంతా ప్రజా సేవకులం
1 min read– ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
– స్పందన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు
– పెండింగ్ లో ఉన్న భూ హక్కు పత్రాల పంపిణీ 48 గంటల్లో పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు :- మనమంతా ప్రజా సేవకులం, ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యల ను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.గుమ్మళ్ళ సృజన రెవెన్యూ అధికారులను ఆదేశించారు..బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పందన, రీ సర్వే, మ్యుటేషన్ కరెక్షన్, ట్రాన్సాక్షన్, స్టోన్ ప్లాంటేషన్, మీ సేవ సర్వీసెస్ తదితర రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహశీల్దార్ లు, రీ సర్వే డెప్యూటీ తహశీల్దార్లు, డిఎల్ పిఓ లతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ డివిజన్, మ్యుటేషన్ కరెక్షన్ వంటి చిన్న చిన్న సమస్యల కోసం సింపుల్ గా వాళ్ళ ఇంటి దగ్గరే సచివాలయంలో దరఖాస్తు చేసుకోకుండా ప్రజలు ఇంతదూరం వస్తున్నారంటే సచివాలయంలో అందే సేవల గురించి వారికి చేరడం లేదని అనుకోవాలన్నారు..సచివాలయం లో ఇలాంటి సేవలు అందుతున్నాయని సచివాలయం లోని రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు తెలియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. గడువు లోపు సమస్యలను పరిష్కరించాలని, ఒక వేళ సమస్యను ఏ కారణం చేత అయినా పరిష్కరించడానికి వీలు లేకపోతే, ఆ కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియ చేయాలన్నారు. కారణం చెప్పకపోతే ప్రజలు మళ్లీ మళ్లీ అదే సమస్యతో కార్యాలయాలకు వస్తారన్నారు. స్పందనలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు.. ఇందులో 60, 70 శాతం రీ ఓపెన్ అవుతున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు..ఈ సంఖ్య పూర్తిగా తగ్గాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వే కి సంబంధించిన భూ హక్కు పత్రాల పంపిణీ 90 శాతం పూర్తి చేశారని, .. పెద్దకడుబూరు,నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల్లో ఇంకా పెండింగ్ లో ఎందుకు ఉందని సంబంధిత తహశీల్దార్ లను ప్రశ్నించారు. 48 గంటల్లోపు పెండింగ్ లో ఉన్న భూహక్కు పత్రాలను పంపిణీ పూర్తి చేసి, నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత తహశీల్దార్ లను ఆదేశించారు..మ్యుటేషన్ ఫర్ కరెక్షన్స్, ట్రాన్సాక్షన్ కి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఎ లో విఆర్ఓ, తహశీల్దార్ లాగిన్ లో చాలా ఉన్నాయని, గడువు లోపు వాటిని క్లియర్ చేయకుండా ఎందుకు అలాగే పెట్టుకున్నారని కలెక్టర్ ప్రశ్నించారు..విఆర్వోలు త్వరగా చేసే విధంగా తహసీల్దార్లు పర్యవేక్షించాలని, అలాగే ఆర్డిఓలు కూడా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.ఆదోని, పత్తికొండ లో జరుగుతున్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ మే 15 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్,పత్తికొండ ఆర్డిఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక రోవర్ కి 120 స్టోన్ ప్లాంటేషన్ లాగ చేయాలని కొన్ని చోట్ల 100 లోపల చేస్తున్నారని తక్కువ చేస్తున్న వారితో రివ్యూ నిర్వహించి పురోగతి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. 86 గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న చెక్ పాయింట్స్ త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ సర్వే ఎడి ని ఆదేశించారు.మీ సేవ సర్వీసెస్ కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, బర్త్ అండ్ డెత్ వాటికి సంబంధించిన సర్వీసెస్ కూడా బియాండ్ ఎస్ఎల్ఎ లో ఉన్నాయని చిన్న చిన్న సర్వీసులు కూడా చేయకుండా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, మనమంతా ప్రజా సేవకులం అని కలెక్టర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుండి సరైన సమయానికి పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ సెల్ ఆక్టివ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఎదైనా పోలింగ్ కేంద్రం కొత్తగా పెట్టాలి అంటే అందుకు సంబంధించిన ప్రపోజల్స్ సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో ర్యాంప్, లైటింగ్, త్రాగు నీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా ఉన్నాయా లేదా అని చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న క్లైమ్ మరియు అబ్జెక్షన్స్ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బిఎల్ఓ లు 7 ఫార్మాట్ తో ఉన్న బిఎల్ఓ రిజిస్టర్ తప్పకుండా మైంటైన్ చేయాలన్నారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ఎఫ్ పిఓఎల్ఆర్ కి సంబంధించి ఆన్లైన్ నందు డేటా ఎంట్రీ పెండింగ్ లో ఉన్న 60 గ్రామాల్లో తహశీల్దార్ లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఓర్వకల్, వెల్దుర్తి లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్వమిత్ర (రీ సర్వే అబాడి భూములు) కి సంబంధించిన పురోగతి గురించి డిపిఓ ని ఆరా తీయగా 67 గ్రామాల్లో అబాడి రీ సర్వే సెలెక్ట్ చేయడం జరిగిందని అందులో 45 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేశామని, 35 గ్రామాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని, మిగిలిన గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ కి వివరించారు.. పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో కూడా త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. హౌస్ సైట్స్ కి సంబంధించి మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ భూములను గుర్తించాలని సూచించారు. ఎస్సీ కమ్యూనిటీ కి సంబంధించిన స్మశాన వాటికలకు 106 ప్రదేశాలలో స్థలాలు గుర్తించాల్సి ఉండగా, అందులో 100 ప్రదేశాలకు ప్రభుత్వ భూములు గుర్తించారని, మిగిలినవి కూడా గుర్తించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డి ఆర్ఓ నాగేశ్వర రావు, కర్నూలు ఆర్డిఓ హరి ప్రసాద్, పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, డి పివో నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.