PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ మాసం లో పేద మైనారిటి మహిళలకి చీరలు పంపిణీ

1 min read

– 1000 మంది పేద కుటుంబాలకు పంపిణీ చేసిన మోమిన్ షబానా
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: రంజాన్ మాసం సందర్భంగా బిజెపి జాతీయ నాయకురాలు తమ డిపో నందు పేద మైనారిటీ మహిళా మనులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతు ప్రతి సంవత్సరం రంజాన్ మాసం లో పేద మైనారిటీ మహిళలకు నూతన వస్త్రాలు అంధించడం వారి కళ్ళలో ఆనందం చూస్తే మాకు ఏంతో సంతోషం ఉంటుందని తెలిపారు. ఇంకా 200 వందల కుటుంబాలకు రంజాన్ తోఫా పేద కుటుంబాలకు అందించాలని అనుకున్నాం అని అతి త్వరలో ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి ఖచ్చితంగా రంజాన్ తోపా అందించటం జరుగుతుంది అని అన్నారు. ప్రజా సేవ చేయడంలో ఉన్న ఆనందం నాకు ఎంతో గర్వంగాను సంతృప్తి ని కలిగిస్తుందనీ మోమిన్ షాబానా వ్యక్తం చేశారు.

About Author