సహిరి మహా పుణ్య కార్యం
1 min read– దాతల సహకారం మరువలేనిది
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రంజాన్ మాసంలో తెల్లవారుజామున ఉపవాసం ఉండే వారికి అన్నదానం చేయడం చాలా మంచి పుణ్యకార్యము అని మైనార్టీ నాయకులు అన్వర్ భాష, అబ్దుల్ రబ్, హబీబ్ లు పేర్కొన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఖిల్లా మసీదులో రంజాన్ మాసం ప్రారంభం రోజు నుండి ముగిసే వరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఒక్క పొద్దులు ఉండేవారికి దాదాపుగా 200 మందికి పైగా దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామని వారి పేర్కొన్నారు. బీదలు, పేదలు ఎక్కువ మంది ఉన్నారని వారి ఇళ్లలో వసతి లేక ఉపవాసం ఉండలేకపోతున్నారని అలాంటి వారికోసం దాతల సహకారంతో ప్రతిరోజు తెల్లవారుజామునే అన్నదానం చేస్తున్నామని అలా చేయడం వల్ల ఉపవాసం ఉండే వారి సంఖ్య పెరగడం జరిగిందన్నారు. అల్లాహ్ కృపతో దాతల సహకారం ఉంటే ప్రతి రంజాన్ మాసంలో ఇలా కొంతమందికి అన్నం పెట్టాలా మాకు అల్లా తోడు ఉండాలని పేర్కొన్నారు.