PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ సారధి “జగనన్నే మా భవిష్యత్తు “..

1 min read

– మాట మీద నిలబడే వ్యక్తి జగనన్న ..
– కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు..
– జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ సుధాకర్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమము పట్టణంలోని 13,14,16,17 వార్డులో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మానపాడు అశోక్, రావుఫ్, వైసీపీ వార్డు కన్వీనర్ రమేష్ లు బుధవారం జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొని కరపత్రాలను పంచుతూ అందరికీ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు ఇస్తారా అని తెలుసుకొని వారి స్పందనను నమోదు చేశారు. అనంతరం వారి అనుమతితో వారి ఇంటికి “జగనన్నే మా భవిష్యత్” స్టిక్కర్లను అతికించారు. మళ్ళీ సంక్షేమ సారధి జగన్ మెహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయాని లేని పక్షంలో ఆగిపోతాయాని అన్నారు.అనంతరం చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న, ఇచ్చిన హామీలు 98శాతం నెరవేర్చాడు. కులం,మతం, ప్రాంతం, పార్టీ చూడం అని ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చర్యలు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. జగనన్న విప్లవాత్మక వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి, లబ్ధిదారులకు లేదా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తూ అవినీతికి తావు లేకుండా చేశారు. అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటున్నారు. మరోసారి జగనన్నకు అండగా ఉంటామని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు సులోచనమ్మ, చింతా విజ్జి, అబ్దుల్ రహిమాన్, బాండ్స్ శ్రీను, యస్.రవి జయ ప్రకాష్, చింతా నాగేంద్ర, వైసిపి నాయకులు డి.రమేష్, మాలిక్, రహంతుల్లా, మున్నా, గృహసారథులు తదీతరులు పాల్గొన్నారు.

About Author