చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు.. అంబరాన్నంటిన సంబరాలు
1 min read– అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అధినాయకుడి పుట్టినరోజును పండగలా జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు అభిమానులు
– రక్తదాన శిబిరానికి విశేష స్పందన
పల్లెవెలుగు వెబ్ నెల్లూరు : చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందిప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రక్తదానం, అన్నదానం, చలివేంద్రాల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మార్కాపురంలో పేదల మధ్య చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు .చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తన జీవితాన్ని పేదలకు, సమాజసేవకు అంకితం చేశారు .8 ఏళ్లు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకపాత్రలో, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్ కోసం తపించారు .ఇప్పడు ప్రతిపక్ష నేతగా కూడా సంక్షోభంలో ఉన్న ఏపీతో పాటు బిడ్డల భవిష్యత్తును కాపాడటం కోసం శ్రమిస్తున్నారు .దేశ రాజకీయ చరిత్రలో ఇంత కష్టపడి పనిచేసే నాయకుడు మరొకరు లేనే లేరు విజన్ 2020 అంటే అప్పట్లో ఏదో అనుకున్నాం..ఆ విజన్ లో భాగంగానే అభివృద్ధి చెందిన హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందిమాకు అటువంటి నాయకుడు దొరకడం, ఆయన నేతృత్వంలో పనిచేస్తుండటం మా అందరి అదృష్టంవైసీపీ అరాచక పాలనతో సంక్షోభంలో చిక్కుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడకలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే ఆయనకు ఫ్యాక్షనిజం చేతకాదు..రౌడీయిజం తెలియదు..దోపిడీ చేయడం, నిద్రలేస్తే అబద్ధాలు మాట్లాడటం చేతకావు..తెలిసిందల్లా రాష్ట్ర అభ్యున్నతికి కష్టపడటమే ఓ వైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు .గొడ్డలి పోటు, కోడికత్తి కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విచారణలను ఎదుర్కొంటున్నారు ..అది మా నాయకులకు వాళ్లకు మధ్య ఉన్న తేడా అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో పాటు శాంతిభద్రతలు క్షీణించి నేరమయమైన ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఆ దేవదేవుడి ఆశీస్సులు చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాతెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నట్టుగా ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం . జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కామెంట్స్నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ నలుమూలలా వేడుకలు జరుపుకొంటున్నారు. అన్న ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని తెలుగు ప్రజలు పార్టీలకు అతీతంగా అభిమానిస్తున్నారు రాష్ట్ర ప్రజలు తమ భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నారు .చంద్రబాబు పాలనలోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయనే నిర్ణయానికి వచ్చేశారు.తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్ర, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి..ఇలా కార్యక్రమం చేపట్టిన విజయవంతం కావడమే అందుకు నిదర్శనం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ పాలనలో మోసపోవడంతో పాటు నష్టపోయామని అనే ఆవేదనలో ప్రజల్లో కనిపిస్తోందిఅన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని స్పష్టంగా కోరుకుంటున్నారు .యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు ఆయన దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచనలకు భిన్నంగా టెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లో ఏపీ 20 ఏళ్లు ముందుండాలని తపించారు .నెల్లూరులో ఘనంగా నిర్వహించిన చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది, ఈ వేడుకల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదములుజిల్లా అధ్యక్షుడు, రూరల్ ఇంచార్జి అబ్దుల్ అజీజ్ కామెంట్స్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో నడిపించగల సమర్ధ నాయకుడు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన రావాలని, ఆయనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు . ఏపీలో అభివృద్ధి లేదు..శాంతిభద్రతలు లేవు..సంక్షేమం కూడా ఒక వర్గానికే పరిమతమైంది..సంపూర్ణమైన సంక్షేమం అందించడంలో పూర్తిగా విఫలయ్యారు నిన్ననే ఒక పథకం అమలు విషయంలో చేతులెత్తేశారు..రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోందని ఒప్పుకున్నారు . రాజ్యానికి ఎప్పుడైనా సంపద సృష్టించే రాజు ఉండాలి కానీ దోచుకునే రాజు కాదుఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఆయురార్యోగాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాంవయస్సుతో సంబంధం లేకుండా రక్తదానం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కంభం విజయ రామి రెడ్డి తదతరులు పాల్గొన్నారు.