PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి

1 min read

– ఉపాధి హామీ చెల్లింపులు సరైన సమయంలో చెల్లించండి : జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: గ్రామాలలోని ప్రజలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని దానికి సంబంధించిన చెల్లింపులు సరైన సమయంలో చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాలులో డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ జిల్లాకు 5 క్లస్టర్స్ ఉంటాయని, ప్రతి మండలానికి ఒక ఏపిఓ ఉంటారన్నారు. ఉపాధి హామీ పనుల చెల్లింపులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్స్ ఎంబుక్, గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు వేజ్ కంపోనెంట్స్ నిర్వహిస్తారన్నారు. హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పనులు నిర్వహిస్తామన్నారు. ఈ ఉపాధి హామీ పనులు 2007వ సంవత్సరం, ఏప్రిల్ 22న ప్రారంభించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పనులకు నిధులు కేంద్రం నుండి 90 శాతం, రాష్ట్రం నుండి 10 శాతం కేటాయిస్తారన్నారు. వేజ్ కంపోనెంట్స్ కు సంబంధించి 60:40 నిష్పత్తిలో ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో 100 రోజులు ఇవ్వడమే ప్రధాన ధ్యేయంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ ఉపాధి హామీ పనులకు 18 సం.లు పైబడిన యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఉపాధి హామీ పనులను ఎటువంటి కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవడంతో పాటు ఈ పనులకు మెషినరీ ఉపయోగించడం జరగదన్నారు. ఉపాధి హామీ పనుల చెల్లింపులు ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లిస్తామన్నారు. సోమవారం మొదులుకొని శనివారం వరకు పనులు జరుగుతాయని, వాటి చెల్లింపులు కూడా పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. పురుషులకు, స్త్రీలకు సమాన వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. 484 గ్రామ పంచాయతీలు ఉంటాయని సదరు గ్రామాలలో ఉన్న సమస్యలను గ్రామ సభ ద్వారా తీర్మానం చేసుకొని పనులు చేసుకుంటామన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చే వారికి షేడ్ నెట్స్ ఏర్పాటు చేస్తామని ఇవి ఫీల్డ్ అసిస్టెంట్లు కంట్రోల్ ఉంటాయన్నారు. పంచాయతీ వారీగా ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఇవ్వడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా అవసరమైన మందులు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీ పనులను పరిధిలో 5 కిలోమీటర్ల మేర పనులు కల్పించేలా చూడాలన్నారు. అనుకోని పరిస్థితుల్లో పని ప్రదేశాల్లో వారు మరణిస్తే 50వేల వరకు పరిహారం ఇస్తామన్నారు. అదే విధంగా ఉపాధి హామీ పనులు జరిగే చోట వాటికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పనులను సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుందని అందుకుగాను ఒక జిల్లా స్థాయి అధికారిని కూడా నియమించడంతో పాటు చెల్లింపుల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు ఉన్న గ్రామ సభలో తెలిపి సంబంధిత అధికారుల నుండి రికవరీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 3.12 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయని, వాటికి 6.02లక్షల వేజ్ సీకర్స్, యాక్టివ్ జాబ్ కార్డ్స్ – 2.46 లక్షలు, యాక్టివ్ వేజ్ సీకర్స్ – 4.51 లక్షల మంది ఉన్నారన్నారు, వీరిలో ఎస్టీ – 1.23%, ఎస్సీ – 21.31%, వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలు 8165 ఉన్నాయన్నారు. ఈ పనులకు 2665 మంది విభిన్న ప్రతిభావంతులు కూడా వచ్చారని వారికి 30% అదనంగా చెల్లిస్తాం అన్నారు. హార్టికల్చర్ ద్వారా కూడా వేప, కానుగ, మోరింగ (మునగ) చెట్లను స్వయం సహాయక మహిళను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా అమృత్ సరోవర్ పథకం క్రింద 80 ట్యాంకులు కేటాయించారని, వాటిలో 40 ఇప్పటి వరకు పూర్తి చేశాం అన్నారు. దీనికి 10 లక్షల మేరకు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. అమృత్ సరోవర్ ట్యాంకుల వద్ద ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేస్తాం అన్నారు. వైయస్సార్ జలకళ ద్వారా 2.50 ఎకరాలు ఉన్న రైతులకు 5 ఎకరాల కంటే ఎక్కువ రైతులకు మోటార్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకు గాను 21,719 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 18,311 ఆమోదించిన, 2448 బోర్లకు అనుమతులు మంజూరు చేశామని, వాటికి 1514 బోర్లు వేయడం జరిగిందన్నారు. అనంతరం ఇతర స్కీమ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ సుబ్రహ్మణ్యం కలెక్టర్ గారికి వివరిస్తూ కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్ కు సంబంధించి రెండు డివిజన్లో ఉన్నాయని, భవన నిర్మాణాల పరిశీలన కొరకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా ఉన్నారని కలెక్టర్ గారికి విన్నవించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ల భవన నిర్మాణాలను నిర్మింప చేస్తున్నామని ఇందు కొరకు గాను జిల్లాకు 347 కోట్ల రూపాయలు అంచనా ఇందులో 458 సచివాలయాలకు గాను 139 భవనాలు పూర్తయినాయని రెండు సచివాలయ భవనాలకు పనులను ఇంకా ప్రారంభించలేదని మిగిలిన భవనాల పనులు వివిధ దశలో ఉన్నాయని, రూరల్ రోడ్స్ ప్రాజెక్టుకు సంబంధించిన 85 రోడ్డు పనులను జరుగుతున్నాయని వీటిని కూడా నిధులు మంజూరు అయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ గారికి పంచాయతీ రాజ్ ఎస్సీ తెలియజేశారు.ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు కలెక్టర్ కు వివరిస్తూ ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించి ఎండాకాలంలో నీటి ఎద్దడి నివారణ కొరకు సమ్మర్ ఆక్షన్ ప్లాన్ గురించి కలెక్టర్ కు వివరించారు. జల జీవన పథకం 2019 ఆగస్టు నెల 15 నుండి ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కుళాయిల ద్వారా నీటిని అందించే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి నివారణ కొరకై ప్రతి మండలానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను జెడ్పిటిసి లకు కేటాయించడం జరిగిందని, జగనన్న కాలనీలో 35%ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయిన కాలనీలలో నీటికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని కలెక్టర్ గారికి వివరించారు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చిన పనులను త్వరితగతిన చేస్తామని ఎస్సీ కలెక్టర్ గారికి విన్నవించారు.కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author