ఏ ఎస్ ఎస్ ఈ ఏ సి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కడప పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న డాక్టర్ అచ్చన్నను తన క్రింది పనిచేసే ఉద్యోగులే కుట్రపన్ని , కుల వివక్షత ద్వారా, ఆ శాఖలోని ఉన్నత అధికారుల ప్రోద్బలంతో ఒక పథకం ప్రకారం హత్య చేయడంఅత్యంత దారుణమని ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ,డాక్టర్ శివరామకృష్ణ, తెలియజేశారు .స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న డా, అచ్చన్న ,ను క్రింది పనిచేసే ఉద్యోగులు తనను ఎన్నో ఇబ్బందులు అవమానాలు గురి చేస్తున్నారని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన ను పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి వహించి సకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా, అచ్చన్న మరణానికి కారకులు అయ్యారని బదిలీల విషయంలో ,ప్రమోషన్ విషయంలో ,శాఖపరమైన అవినీతి విషయంలో, చట్టపరంగా పోరాడుతున్న వ్యక్తి హత్య విషయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి అని అవి చర్చించడానికి ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కాన్ఫిడెరేషన్ ,ఆధ్వర్యంలో ఏప్రిల్ 22వ తేదీ న విజయవాడలోని ఐలాపురం హోటల్ నందు ఉదయం 10; గం” నుండి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించ పడుతుందని ,ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, మేధావులు, దళిత నాయకులు ,ఉద్యోగ సంఘాల నాయకులు, పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం నేషనల్ దళిత్ దళ్ పార్టీ ,రాష్ట్ర అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లగా చాలామంది ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు హత్యలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ టి సి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు అప్పారావు, ఎస్సీ సంఘం నాయకురాలు రమణకుమారి, దళిత నాయకులు క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.