నరసప్ప కొండను తొలగించి -దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి
1 min read– కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్
– దళితులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపా: కెవిపిఎస్
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రంలో గత 13 రోజులు క్రితం నర్సప్ప కొండ దగ్గర పగిలిన బండరాయిని పరిశీలించడానికి జిల్లా అధికార యంత్రాంగం త్వరగా చర్యలు చేపట్టి అక్కడ నివసిస్తున్న కాలనీవాసులకు రక్షణ కల్పించాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక ఎస్సీ కాలనీ హరిజనవాడ స్కూలు దగ్గర ప్రధాన రోడ్డుపై పగిలిన నర్సప్ప కొండ సమస్యను త్వరగా పరిష్కరించాలని కాలనీవాసులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, జనసేన పార్టీ మీడియా ఇన్చార్జి గానుగ భాష లు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు కాలనీ వాసులను అన్ని విధాల ఆదుకుంటామని సత్వరమే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి… 13 రోజులు అయిందని కానీ నేటి వరకు కొండ తొలగించే పనులు చేపట్టలేదని, తప్పకుండా చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు నరసప్ప కొండ ఎప్పుడు పడుతుందోనని భద్రత కరువై … ప్రాణాలతో బిక్కు బిక్కుమంటూ నరకయాతన అనుభవిస్తున్న దళితులను ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హరిజనవాడ స్కూల్ దగ్గర నుండి శాంతియుత ర్యాలీ తహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి తహాసిల్దార్ వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేశారు.ఇప్పటికైనా పగిలిన బండరాయిని సత్వరమే తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ అధికారులకు కోరారు . లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యాలయం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో దళిత కాలనీకి చెందిన పెద్దలు,యువకులు,మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.