PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగులను.. డిఫాల్ట్​ లిస్టులో పెట్టొద్దు..

1 min read
  • ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి
  • పల్లెవెలుగు వెబ్​:రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని,  బ్యాంకులో అవసర నిమిత్తం తీసుకున్న రుణాలకు సకాలంలో ఈఎంఐ చెల్లించలేని దుస్థితిలో ఉన్నారన్నారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా ఉద్యోగులు వీధినపడే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మలిదశ ఉద్యోమంలో భాగంగా ఉద్యోగులు.. గురువారం కర్నూలు కలెక్టరేట్​లోని ఎస్​బీఐ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరికుమార్​ రెడ్డి మాట్లాడుతూ ప్రతినెల ఒకటో తేదీన జీతం రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న  ఉద్యోగులను డిఫాల్ట్ లిస్టులో పెడుతున్నారని, దీంతో భవిష్యత్​లో సదరు ఉద్యోగికి రుణం తీసుకునే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో జీతం ఏ రోజు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామన్నారు. బ్యాంకు మేనేజర్లు దయవుంచి…. ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న రుణాలకు సంబంధించి ఈఎంఐలను జీతం పడినప్పుడే కట్​ చేసుకోవాలని   ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి కోరారు. అనంతరం బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రం అందించారు.  కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు.

About Author