మున్సిపల్ కమిషనర్ పద్ధతి మార్చుకో : మొమిన్ షబాన
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని శుద్ధి చెయ్యడానికి ఉన్నారని నీ ఇంట్లో వెట్టిచాకిరి చేయించుకోవడానికి కాదని వెంటనే మున్సిపల్ కమిషనర్ తన పద్ధతిని వెంటనే మార్చుకొవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మొమిన్ షబాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబాన మాట్లాడుతూ చైర్మన్ ఇంట్లో పని చేసేందుకు డైలీ ఇద్దరు వర్కర్లు వెళుతున్నారు. అక్కడకు వెళ్లే వర్కర్లకు అటెండన్స్ టైంలో హాజరు కానున్న విధులకు హాజరవుతున్నట్లు రిజిస్టర్ లో వేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వుంటున్నారు. వర్కర్లను కూరగాయలు, సరుకుల పనులకు ఉపయోగిస్తున్నారు. వారిచే నానా చాకిరి చేయిస్తున్నారు. ఇలా చెయ్యడం తప్పు మా తాత మరియు తండ్రి గారు 56 సంవత్సరాలు ఆత్మకూర్ సర్పంచ్ గా ఉన్నపుడు పారిశుద్ధ్య సిబ్బందిని ఇలా ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు.ఆత్మకూర్ ప్రజల దాహార్తి తీర్చడం కోసం పట్టణంలోని ఇస్లాంపేట మస్జీద్ ఎదురుగా ఉన్న తన సొంత స్థలంలో నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. కులమతాలకు అతీతంగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి తన తండ్రి సర్పంచ్ జిలానీ అని కొనియాడారు. ఈ చరిత్ర ఆత్మకూర్ లో ఎవరిని అడిగిన చెబుతారని కమిషనర్ కి తెలియచేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ కమిషనర్ కి స్వయంగా నేనే కాల్ చేసి మున్సిపల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని వివరణ అడగగా బదులుగా మున్సిపల్ కమిషనర్ వారిని ఇంటి వద్ద సొంత పనులకు వాడుకుంటున్న, దాంట్లో తప్పు లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.