అపరిస్కృతంగా ఉన్న ఎస్సీ , ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
1 min read– మా ఉద్యోగుల పట్ల ట్రేడ్ యూనియన్ నాయకుల అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం..
– ఏపీ రాష్ట్ర సర్కిల్ సెక్రెటరీ దాసరి నాగేంద్ర కుమార్
– ఏ ఎస్ పి కి వినతిపత్రం అందజేత..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద అఖిలభారత తపాలా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మరియు దళిత, బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత తపాల ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్ర సర్కిల్ సెక్రెటరీ దాసరి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ తపాలా శాఖలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పట్ల ట్రేడ్ యూనియన్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ వారు చేస్తున్న ఆరోపణలను 15 రోజులలోగా నిరూపించిన ఎడల వారిపై పోస్టల్ చీఫ్ పీఎంజీ చట్టపరమైన తగు చర్యలు మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల తరఫున జేఏసీ చైర్మన్ చాగంటి సంజీవ్, నేతల రమేష్ బాబు,ఎట్రాసిటీ కమిటీ సభ్యులు మేతర అజయ్ బాబు , దాసరి రమేష్ , మెండెం సంతోష్ కుమార్ , పొలిమేర హరికృష్ణ , కొరబండి బాబు రావు, గొల్ల కిరణ్ కుమార్, భూపతి అప్పారావు , మేతర సురేష్ , బంగారు రజని కుమార్ , రిటైర్డ్ ఎస్సై ఎం ప్రభాకర్ రావు , మేరుగు సత్యన్నారాయణ మరియు అఖిల భారత తపాలా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్ర 26 జిల్లాల నుండి 13 డివిజన్ల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ ధర్నా అనంతరం ఊరేగింపుగా బయలుదేరి పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరిసత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల సూపర్నెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించరు. పోస్టల్ ఎఎస్పీ కి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారితో దాసరి నాగేంద్ర కుమార్ఏపీ సర్కిల్ సెక్రెటరీ అఖిల భారత తపాల ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.