చిట్వేలిలో ‘కర్ఫ్యూ’ను పరిశీలించిన ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్, చిట్వేలి: పట్టణం లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ IPS పరిశీలించారు. చిట్వేలిలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, హోటళ్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి గారి వెంట కోడూరు సి.ఐ విశ్వనాధ రెడ్డి, చిట్వేలి ఎస్.ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.