కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ ఎన్జీవో
1 min read– జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నిన్న అమెరికా లో దుండగుల కాల్పులలో మరణించిన వీరా సాయేష్ ఏలూరు వాసి. అకాల మరణం చెందడంతో వారి తండ్రి వీరా వెంకట రమణ సి ఆర్ ఆర్ కాలేజ్ లో ఏకనమిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ మరణించారు. వివిఆర్ నాకు మంచి మిత్రుడు. శ్రేయోభిలాషి అభ్యుదయ భావాలు కలిగిన .సామాజిక వేత్త గా పరిచయం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఆయన రెండో కుమారుడు ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి ఎమ్మెస్ ఉన్నత విద్యా కోర్స్ చేస్తూ ఫిల్లింగ్ స్టేషన్ లో పనిచేస్తున్న సందర్భంగా నల్ల జాతీయ దుండగుల చేతుల్లో డబ్బులు కోసం సాయేష్ ని హతమార్చిన ఘటన నన్ను చెలిగించి వేసిందన్నారు. మనుషుల మధ్య మానవత్వం రోజుకి సన్నగిల్లుతోందని. జాతి వివక్షత, కులవ్యక్షత,j మత వివక్షతలు రోజు రోజుకి పెరిగిపోవడం. మనుషుల మధ్య మానవత్వం గిరజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని స్వయంగా నివాసానికి వెళ్లి తెలియజేశారు. వివిఆర్ పెద్ద కుమారుడు వెంకటేష్ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.