బ్రాహ్మణ దిగ్గజం ఉన్నం మోహన్ రావు
1 min read– మోహన్ రావు మృతదేహానికి నివాళలర్పించినసాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కడప : ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నం మోహన్ రావు తెలుగు దేశం పార్టీలో బ్రాహ్మణ దిగ్గజం గా వెలుగోందారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు. ఒంటిమిట్ట మండలం అచ్చెంపేట గ్రామానికీ చెందిన ఉన్నం మోహన్ రావు గురువారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందారు విషయాన్ని ఆయన అల్లుడు ప్రముఖ న్యాయవాది అది నారాయణ ద్వారా తెలుసుకున్న తెలుగు దేశం నాయకుడు సాయినాథ్ శర్మ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కో ఆర్డినేటర్ ఇటుకుల పాడు జనార్దన రావు తెలుగు దేశం న్యాయ విభాగం నాయకుడు గద్దే చండ్ర శేఖర్ తో కలిసి మోహన్ రావు. స్వగృహానికి వెళ్ళి మృతదేాహం పై పుష్ప గుచ్చం ఉంచి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన్ రావు తన రాజకీయజీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బలమైన వ్యక్తిగా ఎదిగాడన్నారు. ఒంటిమిట్ట మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా , సహకార సంఘం అధ్యక్షుడు గా రైతు సంఘం నాయకుడు గా ప్రజానీకానికి ఎన్నో సేవలు చేసాడన్నారు. అలాగే బ్రాహ్మణ సమాజం లో గొప్ప ధైర్యశాలిగా పేరొందా రన్నారు. ఆయన కుమారులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.