PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైట్ పేపర్లకు నిధులు లేవు.. మీరే తెచ్చుకోండి..!

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: వైట్ పేపర్లకు నిధులు లేవు.. మీరే తెచ్చుకోండి అని ఎంపీయూపీ మరియు జడ్పీ పాఠశాలల్లో 8 మరియు 9వ తరగతి వరకు జరిగే సంగ్రహత్మక మూల్యాంకనం..2 పరీక్షల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ఈనెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే అసెస్మెంట్ 2 పరీక్షల్లో ప్రశ్నాపత్రం( ఓఎంఆర్) సీటు మాత్రమే ఇస్తామని పరీక్ష రాయడానికి వైట్ పేపర్లు( తెల్ల కాగితాలు) మీరే తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించినట్లు తెలుస్తుంది. గతంలో పరీక్షలు జరిగే సమయంలో విద్యార్థినీ విద్యార్థులకు అవసరమయ్యే తెల్ల కాగితాలు ఎగ్జామినేషన్( పరీక్షా కేంద్రంలో) సెంటర్లో ఇచ్చేవారు అని విద్యార్థులు పేర్కొంటున్నారు. కానీ అందుకు విరుద్ధంగా క్వశ్చన్ పేపర్ కు ఆన్సర్లు రాయడానికి తెల్ల పేపర్లు విద్యార్థులే తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ కావడం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తుంది. విద్యాశాఖ అధికారులు మాత్రం నిధుల కొరత కారణంగా విద్యార్థులకు వైట్ పేపర్లు( తెల్ల కాగితాలు) తెచ్చుకోవాలని సూచించామని పేర్కొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. సాధారణంగా పబ్లిక్ పరీక్షలు లేదా ఏడాదిలో నిర్వహించే చివరి పరీక్షలు కు సంబంధించి నిర్వహణ సమయంలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అక్కడే కావాల్సినన్ని తెల్ల పేపర్లు అందజేసే వారని వాటిపై సంబంధిత పాఠశాల లేదా హైస్కూల్ కు సంబంధించిన ముద్ర ఉండేదని ఇప్పుడు అలాంటిది లేకుండా విద్యార్థులనే వైట్ పేపర్లు పరీక్షలు రాయడానికి తెచ్చుకోవాలని విద్యాశాఖ సూచించడం పలు ఆరోపణలకు తావిస్తున్నట్టు తెలుస్తుంది.

About Author