రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చెసిన టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని హెల్పింగ్ హాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ టి జి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మోయిన్ భాష, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీ.జీ. భరత్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని హెల్పింగ్ హాండ్స్ మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మోయిన్ బాష రంజాన్ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమని చెప్పారు. అంతేకాకుండా కుట్టు శిక్షణ ఏర్పాటు చేయడం ద్వారా పేద మహిళలకు ఆర్థికంగా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహకారం అందజేస్తున్నానని వివరించారు. సమాజంలో అందరూ సంపాదిస్తారని అయితే కొందరు మాత్రమే సామాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తారని తెలియజేశారు. అలాంటి వారిలో తాము ఎప్పుడూ ముందు ఉంటామని వివరించారు. నగరంలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకునేందుకు ఏదైనా ప్రాజెక్టు రూపకల్పన చేసి తన దగ్గరికి వస్తే దానికి సంబంధించిన ఖర్చు మొత్తాన్ని తాను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. తమ కుటుంబం గత 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందని, అయితే అంతకంటే ముందు 20 ఏళ్ల నుంచి తన తండ్రి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము ప్రజల నుంచి ఏది ఆశించి సేవా కార్యక్రమాలు చేయడం లేదని కేవలం ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పారు. మంచి పనులు చేసే వారిని ప్రోత్సహిస్తే వారు మంచి మరిన్ని మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సమాజంలో మంచి పనులు చేసేందుకు ముందుకు వచ్చే వారిపై ఎవరైనా నిందలు వేస్తే వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు యువనేత టీజీ భరత్ తెలిపారు.