వ్యాక్సిన్‌పై అపోహాలు వద్దు..
1 min readకడప జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బు రాజన్ ఐపీఎస్
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. గురువారం నగరంలోని ఉమేష్ చంద్ర కళ్యాణ మంటపం వద్ద వ్యాక్సినేషణ్ ప్రక్కియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45 సంవత్సరాలు దాటిన పోలీసు కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, శాశ్వత కేంద్రాల వద్ద టోకెన్ విధానం ద్వారా వ్యాక్సిన్ వేయించడం జరుగుతుందని, కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మరింత మెరుగు పడుతుందని తద్వారా కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, పోలీస్ యూనిట్ డాక్టర్ సమీరా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.