కొత్తపల్లి లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి
1 min read– విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి
– ఎమ్మార్యో కు వినతిపత్రం అందజేసిన ఐసా నాయకులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని శుక్రవారం కొత్తపల్లి మండల తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ కు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా ) కొత్తపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మండల నాయకులు రాజేష్ మాట్లాడుతూ మారుమూల మండలమైన కొత్తపల్లి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 300 నుంచి 400 మందికి పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుల కోసం ఆత్మకూరు,నంద్యాల, కర్నూలు ఇంకా ఇతర పట్టణాల్లోని ప్రయివేటు కళాశాలలకు వెళ్లడం ద్వారా విద్యార్థులకు ఆర్థిక భారంగా ఉంటుందని అన్నారు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కొత్తపల్లి మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ మండలంలో కాలేజీలో ఏర్పాటు చేస్తే వారి భవిష్యత్తు బంగారు బాట వేసినట్టు ఉంటుందని వారు తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే గారు,స్థానిక ప్రజా ప్రతినిధులు ,అధికారులు, జూనియర్ కళాశాల ఏర్పాటు కృషి చేయాలని కోరారు. లేనియెడల ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఐసా) ఆధ్వర్యంలో విద్యార్థులను, ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఐసా మండల నాయకులు వర్ధన్,నాని,రాజు,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.